News March 19, 2025
వనపర్తి: ప్రభుత్వ వైద్య కళాశాలకు కొత్త ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్

వనపర్తి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్త ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ డి.కిరణ్మయి బాధ్యతలు స్వీకరించారు. ఐడీవోసీలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని బుధవారం ఆమె మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. డాక్టర్ కిరణ్మయి, గత మూడేళ్లుగా వనపర్తి ఎంసీహెచ్‌లో ప్రొఫెసర్ ఆఫ్ అబ్ స్టేట్రిక్స్, గైనకాలజీ నిపుణులుగా విధులు నిర్వహించారు. బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
Similar News
News November 4, 2025
తెల్లారకముందే జూబ్లీలో పార్టీల కూత

సూర్యుడు ఇంకా ఉదయించక ముందే.. మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జూబ్లీ వీధుల్లో వాలిపోతున్నారు. ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను కలుస్తూ నచ్చిన హామీలిస్తున్నారు. ప్రచారానికి వెళ్లడం ఆలస్యమైతే ఓటర్లు పనులకు వెళ్లిపోతారని కాబోలు. ఇక్కడ ఎక్కువ శాతం బస్తీలు ఉండటంతో ప్రజలు ఉపాధి కోసం పనులకు వెళ్తారు. అందుకే నాయకులు ఉదయాన్నే ప్రచారానికి వెళుతున్నారు.
News November 4, 2025
6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు: అ.కలెక్టర్

ఈనెల 6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పత్తి కొనుగోలు పై మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యం, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ పిలుపుమేరకు సీసీ కొనుగోలు కేంద్రాలకు ఆ రోజు పత్తి తీసుకురావద్దని సూచించారు.
News November 4, 2025
వరి మాగాణుల్లో పంట ఎంపిక.. ఇవి ముఖ్యం

వరి మాగాణుల్లో పంట ఎంపికకు ముందు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. రైతులు ఎంపిక చేసుకునే ప్రత్యామ్నాయ పంటలకు స్థిరమైన మార్కెట్, మద్దతు ధర ఉండేలా చూసుకోవాలి. కనీస మద్దతు ధర, పంట భీమా, నాణ్యమైన విత్తనాలు సకాలంలో లభించే పంటలను ఎన్నుకోవాలి. వరికి ప్రత్యామ్నాయంగా ఎన్నుకునే పంటలు తక్కువ నీటిని వినియోగించుకొని, దిగుబడిని అందించేవి అయ్యి ఉండాలి.


