News April 6, 2025
వనపర్తి: ప్రభుత్వ వైఫల్యాలపై సమరం: నిరంజన్ రెడ్డి

BRS పార్టీ ఆవిర్భావ రజితోత్సవ మహాసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కలిసి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజాసంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై BRS ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని నిరంజన్ రెడ్డి తెలిపారు.
Similar News
News April 6, 2025
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన జాన్ వెస్లీ

మధురైలో జరుగుతున్న సీపీఎం 24వ జాతీయ మహాసభల్లో అమరచింత వాసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నేడు చివరి రోజు జరిగిన జాతీయ మహాసభలో కేంద్ర నాయకత్వం జాన్ వెస్లీకి కేంద్ర కమిటీలో స్థానం కల్పించింది. జాన్ వెస్లీ కేంద్ర కమిటీకి ఎన్నికైన నేపథ్యంలో అమరచింత సీపీఎం నాయకులు గోపి, బుచ్చన్న, అజయ్, వెంకటేశ్, రమేష్, శ్యాంసుందర్ జాన్ వెస్లీకి అభినందనలు తెలిపారు.
News April 6, 2025
పాపిరెడ్డి గ్రామానికి రానున్న వైఎస్ జగన్.. రూట్‌మ్యాప్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 8న రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలీకాప్టర్‌లో సీకే పల్లి చేరుకుంటారు. 10:50కి సీకే పల్లి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.05 గంటలకు పాపిరెడ్డి గ్రామానికి చేరుకుంటారు. 11.10 వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12.30కి బెంగళూరుకి తిరుగు పయనమవుతారు.
News April 6, 2025
ప్రియురాలితో మహిళా క్రికెటర్ పెళ్లి

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ యాష్లీ గార్డనర్ తన ప్రియురాలు మోనికా రైట్ను వివాహమాడారు. 2021 నుంచి డేటింగ్లో ఉన్న వీరు గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తాజాగా అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన గార్డనర్.. ‘Mrs & Mrs Gardner’ అంటూ తమ వెడ్డింగ్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆమె ఈ ఏడాది WPLలో గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.