News March 24, 2025

వనపర్తి: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మాలలకు తీరని అన్యాయం’

image

రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి మాలలకు సంక్షేమ పథకాల్లో, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్‌లో తీరని అన్యాయం జరిగిందని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాదారి భోజరాజు అన్నారు. మాలలకు ప్రతి సంక్షేమ పథకంలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికు వినతి పత్రం అందించారు. మద్దిలేటి వెంకటేశ్, కురుమూర్తి, కరుణాకర్ పాల్గొన్నారు.

Similar News

News March 26, 2025

యాడ్ ఫ్రీ ఇన్‌స్టా కోసం సబ్‌స్క్రిప్షన్.. ఎక్కడంటే?

image

యాడ్ ఫ్రీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ కోసం సబ్‌స్క్రిప్షన్‌ను తేవాలని ‘మెటా’ యోచిస్తోంది. తాజాగా యూరప్‌లో ఈ విధానాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. యూరోపియన్ నియంత్రణ సంస్థలకు ‘మెటా’ తన ప్రతిపాదలను పంపింది. మొబైల్‌లో యాడ్‌ఫ్రీ ఇన్‌స్టా కోసం నెలకు $14(రూ.1200), డెస్క్‌టాప్‌లో FB& INSTA కోసం 17 డాలర్ల వరకు ఉండనుంది. అక్కడ అమలైతే అన్నిచోట్లా తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News March 26, 2025

చేయని తప్పునకు 46 ఏళ్ల జైలు శిక్ష

image

జపాన్‌లో ఓ వ్యక్తి చేయని తప్పునకు 46 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇందుకు కోర్టు అతడికి ₹12కోట్ల నష్ట పరిహారమివ్వాలని పోలీసులను ఆదేశించింది. 1966లో ఇవావో హకమాడ అనే వ్యక్తి ఓ సోయాబీన్ ప్లాంట్‌లో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో ప్లాంట్ యజమాని, భార్యాపిల్లలు వారింట్లోనే కత్తిపోట్లకు గురై చనిపోయారు. ఆ నేరాన్ని అతడే చేశాడని పోలీసులు తప్పుడు సాక్ష్యాలతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మరణశిక్ష విధించింది.

News March 26, 2025

NLG: సన్న బియ్యం పంపిణీకి చకచకా ఏర్పాట్లు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డుబియ్యం మొత్తం వెనక్కి పంపించాలని సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే గోదాముల్లో బియ్యం సిద్ధంగా ఉంచిన అధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వాటిని రేషన్ షాపులకు తరలించి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

error: Content is protected !!