News October 13, 2025
వనపర్తి: బాల్యవివాహాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో బాల్యవివాహాలు నిర్వహించడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే అమ్మాయి, అబ్బాయి, తల్లిదండ్రులతోపాటు వివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈనెల 15న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామస్థాయి కమిటీలు, సమావేశాలు నిర్వహించి అదే రోజున మండల కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Similar News
News October 13, 2025
నవంబర్ మొదటి వారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు

నవంబర్ మొదటివారం నుంచి ఎన్టీఆర్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సోమవారం తెలిపారు. మార్కెటింగ్, వ్యవసాయం, పోలీస్, అగ్నిమాపక, రవాణా, సీసీఐ ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డ్‌లను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేశామన్నారు. రైతు సేవా కేంద్రాల్లోని వీఏఏలను సంప్రదించి పత్తి విక్రయాల సమాచారాన్ని తెలుసుకోవాలని రైతులకు సూచించారు.
News October 13, 2025
అఫ్గాన్ ప్రభుత్వంలో మాకూ చోటివ్వాలి: మైనార్టీ ప్రతినిధులు

అఫ్గాన్‌లోని గురుద్వారాలు, టెంపుళ్ల మరమ్మతు, అభివృద్ధికి తోడ్పడాలని మైనార్టీ ప్రతినిధులు ఆదేశ విదేశాంగ మంత్రి ముత్తాఖీని ఢిల్లీలో విన్నవించారు. అక్కడి ప్రభుత్వంలోనూ హిందూ, సిక్కులకు చోటివ్వాలని కోరారు. ఆలయాల పునరుద్ధరణ, భద్రత, మైనార్టీలకు ఆస్తి హక్కు కల్పించడానికి ముత్తాఖీ హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. వాటిని సందర్శించడానికి రావాలని పిలిచారన్నారు. తాలిబన్ల రాకతో వారంతా ఇండియా వచ్చేశారు.
News October 13, 2025
ఇందిరాగాంధీ స్టేడియంలో కబడ్డీ, వాలీబాల్ జట్ల ఎంపిక

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-19 కబడ్డీ, వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.