News September 14, 2025
వనపర్తి: బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు. ప్రేమ పేరుతో 18 ఏళ్ల లోపు బాలికలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. బాలల సంరక్షణ కోసం 24 గంటల హెల్ప్‌లైన్ నెంబర్ ‘1098’ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
Similar News
News September 14, 2025
తిరుపతిలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట..!

తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీ నియామకం తీవ్ర <<17709932>>వివాదానికి<<>> దారితీసింది. ఏపీ బ్యూటిఫికేషన్ ఛైర్మన్ సుగుణమ్మకు తెలియకుండానే పాలకమండలి నియామకం, నేడు ప్రమాణస్వీకారం జరిగిందని పలువురు టీడీపీ తమ్ముళ్లు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు పార్టీలో తమకు అన్యాయం జరిగిందని పలువురు కుల సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఎక్కడ ముగియనుందో వేచి చూడాలి.
News September 14, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరులో 81మిమీ, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5మిమీ వర్షపాతం నమోదైందని చెప్పారు. పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మిమీ, పెదకూరపాడులో 40.2 మిమీ, చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని వెల్లడించారు.
News September 14, 2025
మక్కువ: మేడ పైనుంచి కింద పడి వ్యక్తి మృతి

మక్కువ మండలం పాలకవలసకు చెందిన పాల గౌరు విద్యుత్ తీగలు తగిలి మేడ పైనుంచి కిందపడి ఆదివారం మృతి చెందాడు. బీసీ కాలనీకి చెందిన ఎం.ఆనందరావు ఇంటిని కట్టేందుకు గౌరు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. లేబర్‌ను తీసుకొని ఇంటి స్లాబ్ పరిశీలించేందుకు పిట్ట గోడ ఎక్కాడు. దిగే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి కిందపడ్డాడు. తీవ్రంగా గాయాలు కావడంతో మరణించారు. మృతుని భార్య పైడితల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.