News April 3, 2025

వనపర్తి బిడ్డ అనూష తగ్గేదేలే..!

image

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అనకాయపల్లి పంచాయతీ పరిధి పిల్లిగుండ్ల తండాకు చెందిన ఇస్లావత్ అనూష వికారాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ విభాగంలో ఎంపికై, బిహార్లో జరిగిన జాతీయ కబడ్డీ పోటీల్లో ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిలో అనూషను శాలువాతో సత్కరించి అభినందించి మాట్లాడారు. గ్రామీణ విద్యార్థులకు అనూష స్ఫూర్తి కావాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.

Similar News

News November 9, 2025

సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి సర్క్యులర్ జారీ

image

సింగ‌రేణి సంస్థలో అంతర్గత అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి యాజమాన్యం స‌ర్క్యుల‌ర్ విడుద‌ల‌ చేసింది. ఈ 2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ&ఎం) పోస్టులు 23, సివిల్‌లో 4, ఈ 1 గ్రేడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ&ఏం) పోస్టులు 33, సివిల్‌లో 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 10 నుంచి 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు

News November 9, 2025

ధర్మపురి నర్సన్నకు భారీ ఆదాయం

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల తాకిడీ పెరిగింది. దీంతో అదే మొత్తంలో నర్సన్నకు భారీగా ఆదాయం సమకూరింది. దేవాలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టికెట్ల ద్వారా రూ.2,72,258, ప్రసాదాల ద్వారా రూ.1,95,750, అన్నదానం ద్వారా రూ.57,759.. మొత్తం ఆదాయం రూ.5,25,767 ఆదాయం వచ్చింది. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు దేవాలయ అధికారులు తెలిపారు.

News November 9, 2025

శుభ సమయం (09-11-2025) ఆదివారం

image

✒ తిథి: బహుళ చవితి ఉ.9.54 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర రా.2.23 వరకు
✒ శుభ సమయాలు: ఆరుద్ర శివ పూజలకు మంచిది
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: ఉ.11.40-మ.1.10
✒ అమృత ఘడియలు: సా.4.56-సా.6.26