News April 17, 2025

వనపర్తి: బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది: చిన్నారెడ్డి

image

రాహుల్ గాంధీకి పెరుగుతోన్న ఆదరణ చూసి మోదీ ఓర్వలేక పోతున్నారని, అందుకే అక్రమ కేసులు పెడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆరోపించారు. వనపర్తిలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాహుల్ సంకల్పం ముందు మోదీ కుట్రలు పనికిరావని చిన్నారెడ్డి హెచ్చరించారు. రాజేంద్రప్రసాద్ యాదవ్, కదిరే రాములు, గడ్డం వినోద్, అబ్దుల్లా ఉన్నారు.

Similar News

News February 28, 2026

గద్వాల్: అదృశ్యమైన యువకుడి సూసైడ్..!

image

గద్వాల మండలం గుంటుపల్లికి చెందిన బొల్లెద్దుల రోహిత్ (24) ఇటీవల అదృశ్యం కాగా అతడి తండ్రి బొల్లెద్దుల జానీ తన కుమారుడు కనిపించడం లేదని ఈనెల 25న గద్వాల పీఎస్‌లో కంప్లైంట్ చేశాడు. అయితే రోహిత్ ప్రేమించిన అమ్మాయి తరఫు బంధువుల వేధింపు వల్ల సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై రోహిత్ తండ్రి జానీ శనివారం హైదరాబాద్ నాచారం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News February 28, 2026

శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా రూపలత

image

శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిగా (ఐసీడీఎస్ పీడీ) కె.రూపలత శనివారం నియమితులయ్యారు. ప్రస్తుతం రణస్థలం మండలం సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న ఈమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో పీడీగా పనిచేసిన జయదేవి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆమెకు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

News February 28, 2026

మంగళగిరిలో జనసేన ఆఫీస్ ఘటన.. ఐదుగురు పోలీసులు సస్పెండ్?

image

మంగళగిరి జనసేన కార్యాలయంలో నీలాద్రి అనే వ్యక్తి కార్ల అద్దాలను ధ్వంసం చేసి సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. భద్రతా విభాగం రిజర్వు ఇన్‌స్పెక్టర్ పెంటారావుతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. భద్రత వైఫల్యాల వల్లే ఘటన చోటు చేసుకుందని నిర్ధారణ కావడంతో చర్యలకు ఉపక్రమించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే నీలాద్రిని అరెస్ట్ చేశారు