News January 17, 2025
వనపర్తి: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYDలోని అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వనపర్తి(D) పెద్దగూడెంకు చెందిన భానుప్రకాశ్ ఓ కళాశాలలో బీటెక్ 1st ఇయర్ చదువుతూ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై ఉరేసుకున్నాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు. అమ్మానాన్నలకు నోట్ బుక్‌లో లేఖను రాసినట్లు తెలుస్తోంది.
Similar News
News January 17, 2025
MBNR: పంచాయతీ పోరు.. బ్యాలెట్ సిద్ధం!
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. సర్పంచ్ అభ్యర్థులకు గులాబి.. వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. MBNR-441 GPలో 3,836 వార్డులు, NGKL-464 GPలో-4,140 వార్డులు, NRPT-280 GPలో 2,455 వార్డులు, WNPT-260 GPలో-2,366 వార్డులు, GDWL-255 GPలో 2,390 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను ప్రకటించింది.
News January 17, 2025
బిజినేపల్లి: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: భాస్కర్
జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశ ఎంపిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వట్టెం నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. సూపరింటెండెంట్, పరిశీలకులకు బిజినేపల్లిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 80 సీట్లకుగాను ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 6,602 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఈనెల18న ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు.
News January 16, 2025
నాగర్ కర్నూల్: అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్‌గా పి.అమరేందర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసి, జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.