News November 22, 2025

వనపర్తి: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

image

భర్త మృతిని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వీపనగండ్లకు చెందిన మౌలాలి 15 రోజుల క్రితం మరణించాడు. మౌలాలి భార్య అలివేల (50) భర్త మరణంతో కుంగిపోయి తీవ్ర మానసిక ఆవేదనకు గురైంది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది.

Similar News

News November 22, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,860 పెరిగి రూ.1,25,840కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,700 ఎగబాకి రూ.1,15,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధరపై రూ.3,000 పెరిగి రూ.1,72,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 22, 2025

గజ్వేల్: అందని వైద్య సేవలు..!

image

వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ప్రారంభించిన ఎల్డర్లీ హెల్త్ కేర్ కార్యక్రమం నామమాత్రంగా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. వృద్ధులకు ఆయా రకాలైన వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందించారు. కానీ ప్రస్తుతం ఎన్సీడీ(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్)లో విలీనం చేయడంతో వృద్ధులకు సేవలు నిలిచిపోయాయి.

News November 22, 2025

NLG: రిజర్వేషన్ కలిసివచ్చేనా!?

image

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతోంది. గ్రామం, వార్డు రిజర్వేషన్లు ఏది అవుతుందోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం కలెక్టరేట్లో ఆర్డీవో, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది రిజర్వేషన్ల కసరత్తును ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వం పాత కేటగిరిల్లో రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో రిజర్వేషన్ కలిసి వస్తుందా? లేదా అనే ఆందోళన కనిపిస్తుంది.