News October 29, 2025
వనపర్తి: భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

‘మొంథా’ తుఫాను ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News October 29, 2025
సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మహేశ్ మేనకోడలు మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ SMలో ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో జాన్వీ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. మూవీస్‌లోకి రావాలని ఆమె డ్రైవింగ్, డాన్స్, ఫిట్‌నెస్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.
News October 29, 2025
మణుగూరులో వ్యక్తి సూసైడ్

మణుగూరులోని సి-టైప్ గేట్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మల్లం శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
News October 29, 2025
సంగారెడ్డి: బిడ్డపై తండ్రి ప్రేమ అంటే ఇదే..!

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం AEO శ్వేత రెండు కిడ్నీలు ఫెయిలై HYD కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె తండ్రి బిరాదర్ శ్యామ్‌రావు తన ఒక కిడ్నీని కూతురికి దానమిచ్చి ప్రాణం పోశారు. వీరి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్వేతకు ICU నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేశారని ఆమె తల్లి ఉమారాణి తెలిపారు. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సభ్యుడు నాగేశ్ వారికి ధైర్యాన్నిచ్చారు.


