News January 26, 2026

వనపర్తి: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ ఆదర్శ్ సురభి

image

రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని తెచ్చిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన 2,114 దరఖాస్తుల్లో 1,450 దరఖాస్తులను పరిష్కరించామని వెల్లడించారు. రేవల్లి, ఏదుల, శ్రీరంగాపూర్ మండలాల్లో రూ.96 లక్షలతో నిర్మిస్తున్న ఎంఆర్ఓ కార్యాలయాల పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే వీటిని అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 22, 2026

తగ్గనున్న వంటనూనె ధరలు?

image

వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. క్రూడ్ పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10% తగ్గించింది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల మొత్తం సుంకం 27.5% నుంచి 16.5% పడిపోతుంది. భారత్ తన వంటనూనెల అవసరాల కోసం 70% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లీటర్ నూనెపై ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

News February 22, 2026

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: SP

image

తూ.గో జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల కోసం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని SP నరసింహ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

News February 22, 2026

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

image

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.