News October 24, 2025
వనపర్తి: మద్యం షాపులకు 757 దరఖాస్తులు

వనపర్తి జిల్లాలోని 36 మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. జిల్లాలో మొత్తం 757 దరఖాస్తులు వచ్చాయని జిల్లా మద్య నిషేధ, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ దరఖాస్తులకు లాటరీ పద్ధతి ద్వారా ఈ నెల 27న కలెక్టరేట్ సమావేశ మందిరంలో దుకాణాల కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ ప్రక్రియను చేపడతారని తెలిపారు.
Similar News
News October 25, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఖర్గేతో భేటీ!

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ చీఫ్ ఖర్గేతో ఆయన భేటీ కానున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలపై అధిష్ఠానం సీఎం అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రుల మధ్య విభేదాలు, అంతర్గత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశముంది.
News October 25, 2025
డిసెంబర్ కల్లా గ్రేటర్ తిరుపతి!

AP: గ్రేటర్ తిరుపతికి అడుగులు పడుతున్నాయి. నిన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గ్రేటర్ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. డిసెంబర్ కల్లా గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో కలెక్టర్ విలీన ప్రతిపాదనలను GP కార్యదర్శులకు పంపించారు. కాగా తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు పరిధిలోని 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేయనున్నారు.
News October 25, 2025
నాగుల చవితి రోజున చదవాల్సిన మంత్రాలు

నాగుల చవితి రోజున ‘ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్’ శ్లోకాన్ని జపిస్తే.. భక్తులు ముక్తిని, మోక్షాన్ని, నాగరాజు ఆశీస్సులను పొందుతారని పండితులు చెబుతున్నారు. పుట్టలో పాలు పోసేటప్పుడు ‘సర్వే నాగాః ప్రియన్తాం మే యే కేచిత్ పృథ్వీతలే.. విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్’ శ్లోకాన్ని పఠిస్తే.. సర్పాలు సంతృప్తి చెందుతాయని నమ్మకం.


