News April 7, 2025
వనపర్తి: ‘మాంసం వారానికి ఒకసారే తినండి’

ఉమ్మడి << 16019120>>పాలమూరులో<<>> 18 ఏళ్లు పైబడిన వారిలో సగటున 20 శాతం అంటే 87,739 మంది అధిక రక్తపోటు బాధితులే ఉన్నారు. క్యాన్సర్ రోగులు 188మంది, మధుమేహ వ్యాధిగ్రస్థులు 50,421 మంది ఉన్నారు. మటన్, ఆయిల్‌ఫుడ్, అధిక ఉప్పు, పచ్చడి, తంబాకు, గుట్కా, బ్రెడ్, బేకరీ ఫుడ్ తినొద్దని, స్కిన్‌లెస్ చికెన్, గుడ్డు తెల్ల సొన, ఉడకబెట్టిన కూరగాయలు, పాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే మాంసం తినాలన్నారు.
Similar News
News July 4, 2025
పాలమూరు: కొత్త రేషన్ కార్డ్.. ఇలా చేయండి!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల మంజూరు, పేర్లు చేర్చడంపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న అనంతరం రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే మొదట సంబంధిత తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తల్లిదండ్రుల కార్డుల నుంచి పేర్లను తొలగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News July 4, 2025
ఇసుక అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టాలి: కలెక్టర్

అక్రమ ఇసుక తవ్వకాలు పూర్తిగా అరికట్టాలని కమిటీ సభ్యులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత వర్షాకాలంలో స్టాక్ యార్డుల ద్వారా ఇసుక విక్రయాలు నిర్వహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు.
News July 4, 2025
పాడేరులో మన్యం వీరుడి జయంతి ఉత్సవాలు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి శుక్రవారం పాడేరు కలెక్టరేట్‌లో ఘనంగా జరగింది. కలెక్టర్ దినేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్ర ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శర్మన్ పటేల్, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.