News February 16, 2025
వనపర్తి: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

వనపర్తి జిల్లాలోని కోర్టులలో మార్చి 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత పేర్కొన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్, సివిల్, బ్యాంకు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకునేలా కృషి చేయాలన్నారు.
Similar News
News December 18, 2025
‘PPP’ తప్పనుకుంటే నన్ను జైలుకు పంపు జగన్: సత్యకుమార్

AP: PPP మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘PPPలో అభివృద్ధికి త్వరలో 4 కాలేజీలను భాగస్వాములకిస్తాం. ఇది తప్పయితే వైద్య శాఖ మంత్రినైన నన్ను జైలుకు పంపే చర్యలు తీసుకోవచ్చు’ అని సవాల్ విసిరారు. PPPని కేంద్రం, నీతి ఆయోగ్, కోర్టులు సమర్థించాయని, అందుకని PM మోదీ సహా అందరినీ జైలుకు పంపిస్తావా? అని నిప్పులు చెరిగారు.
News December 18, 2025
HYD:గుడ్ న్యూస్.. అన్ని యాప్‌లోనే: రిజిస్ట్రార్

తెలుగు వర్సిటీ సంబంధిత వివరాలన్నీ నూతనంగా ఆవిష్కరించిన ప్రత్యేక యాప్‌లోనే ఉంటాయని వర్సిటీ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు తెలిపారు. వర్శిటీ కోర్సుల వివరాలు, సిలబస్, పరీక్షల తేదీలు, చెల్లించాల్సిన ఫీజుల వివరాలు, పరీక్షా ఫలితాలు, నోటిఫికేషన్లు వంటి అంశాలు ఇకపై విద్యార్థులకు వారి మొబైల్లోనే అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ ప్రత్యేక యాప్ ని కోటక్ మహేంద్ర బ్యాంక్ సౌజన్యంతో రూపొందించబడిందని తెలిపారు.
News December 18, 2025
చెక్ డ్యాం ఘటనపై విచారణ జరపండి: మంత్రి శ్రీధర్ బాబు

మంథని మండలం సోమన్‌పల్లి- పీవీ నగర్ మధ్య <<18591208>>మానేరు నదిలో చెక్ డ్యాం కొట్టుకుపోయిన విషయం <<>>సంచలనంగా మారింది. ఈ ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఈ ఘటనకు అసలు కారణాలేంటి.? చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదా..? లేక సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న విషయాలపై సమగ్ర విచారణ చేయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.


