News October 17, 2025
వనపర్తి: మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

జిల్లా కేంద్రంలోని నల్లచెరువు ట్యాంక్ బండ్‌పై సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన సామగ్రిని, మొక్కలను సంరక్షించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లచెరువు ట్యాంక్ బండ్‌తో పాటు, ఇండోర్ స్టేడియంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్ బండ్‌కు ఇరువైపులా ఆర్చితోపాటు గేటు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 17, 2025
‘డ్యూడ్’ రివ్యూ&రేటింగ్

ఎంతో ఇష్టపడే మరదలి ప్రేమను హీరో రిజక్ట్ చేయడం, తిరిగి ఎలా పొందాడనేదే ‘డ్యూడ్’ స్టోరీ. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ మరోసారి ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో అలరించారు. హీరోయిన్ మమితా బైజు స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కథ పాతదే అయినా కామెడీ, ట్విస్టులు బోర్ కొట్టకుండా చేస్తాయి. సెకండాఫ్ స్లోగా ఉండటం, ఎమోషన్స్ అంతగా కనెక్ట్ అవ్వకపోవడం మైనస్.
RATING: 2.75/5
News October 17, 2025
తొండంగి: వేధింపులు తాళలేక వివాహిత మృతి

భర్త, అత్త వేధింపులు తాళలేక వివాహిత శిరీష (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన తొండంగి (M) గోపాలపట్నంలో జరిగింది. పాతపట్నం మండలం తిడ్డిమికి చెందిన శిరీషకు ఈ ఏడాది మేలో ప్రదీప్‌తో వివాహమైంది. వారు గోపాలపట్నం వచ్చి జీవిస్తున్నారు. అనుమానంతో భర్త, అత్త వేధిస్తున్నారంటూ శిరీష బుధవారం తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. అదే రోజు శీరిష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తొండంగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News October 17, 2025
ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

AP: ఐపీఎస్ సంజయ్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈనెల 31 వరకు రిమాండ్ పొడిగించడంతో ఆయనను కాసేపట్లో విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ నిందితుడిగా ఉన్నారు.