News February 8, 2026
వనపర్తి: మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు!

వనపర్తి మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య బలమైన త్రిముఖ పోటీ నెలకొంది. అగ్రనేతల పేర్లతో అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులు ఎవరి ఓట్లు చీలుస్తారో అన్న ఉత్కంఠ సర్వత్ర వ్యక్తమవుతోంది.
Similar News
News February 9, 2026
గాంధీ జయంతికి వెంకీ ‘ఆదర్శ కుటుంబం’!

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘ఆదర్శ కుటుంబం’(AK 47) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వేసవిలో రిలీజ్ కానుందని ప్రకటించినా అక్టోబర్ 2(గాంధీ జయంతి)కి విడుదల తేదీ మారే అవకాశాలున్నాయని సినీ వర్గాలు తెలిపాయి. అటు వెంకీ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కే మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని టాక్. ఇదే జరిగితే మూడున్నర నెలల వ్యవధిలో వెంకీ నటించిన 2 సినిమాలు విడుదల కానున్నాయి.
News February 9, 2026
సదాశివనగర్: అనారోగ్యం బాగా లేక ఆత్మహత్య

సదాశివనగర్ మండలం వడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన అశోక్ అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News February 9, 2026
నిజాంసాగర్: రూపు కోల్పోతేనేమీ..ఫొటో ఫోజులకు అడ్రస్ ఇదే!

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకప్పుడు పర్యాటకులను తీసుకెళ్లిన బోటు కాలక్రమేణా నిర్వహణ కరువై ప్రస్తుతం నీటి ఒడ్డున తుప్పు పట్టి రూపురేఖలను కోల్పోయింది. ఈ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు ఇనుప చట్రంగా మారిన దీనిపైనే ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఓ వ్యక్తి ఫొటో దిగుతున్న సన్నివేశాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు.


