News December 29, 2025
వనపర్తి మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

వనపర్తి మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 70,416 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 3,729, ఎస్సీ జనాభా 6,836గా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఓటరు జాబితాను తయారు చేయాలని అధికారులను ఈరోజు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధం వీడింది.
Similar News
News December 30, 2025
HYD: టోల్‌ప్లాజాలు ఉండవిక.. RRRకు శాటిలైట్

హైవే మీద టోల్ కట్టడానికి కారు ఆపే రోజులకు ఇక చరమగీతం పాడబోతున్నారు. RRR వెంబడి ఎక్కడా మీకు టోల్ గేట్లు కనిపించవు. ఇది FREE అనుకుంటే పొరపాటే. కేంద్రం ఇక్కడ Global Navigation Satellite System శాటిలైట్ ట్రాకింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. రోడ్డు ఎక్కిన సెకను నుంచే ఆకాశంలో ఉన్న శాటిలైట్ మీ కారుని ఫాలో అవుతుంది. ప్రయాణించిన ప్రతి మీటరుకు లెక్క కట్టి, నేరుగా అకౌంట్ నుంచి పైసలు లాగేస్తుంది.
News December 30, 2025
మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్ఐల బదిలీ

మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. సీసీసీ నస్పూర్ SHO ఉపేందర్ రావు టాస్క్ ఫోర్స్ రామగుండం, తాండూర్ SHO కిరణ్ కుమార్ హాజీపూర్‌కు, ఇక్కడ పని చేస్తున్న స్వరూప్ రాజ్ PCR రామగుండం, రామకృష్ణాపూర్ SHO రాజశేఖర్ CCRB రామగుండానికి బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్-1 అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
News December 30, 2025
పల్నాడు: ఇకపై 3 గంటల్లోనే రాజధానుల ప్రయాణం.!

హైదరాబాద్-అమరావతి మధ్య ప్రయాణ కాలాన్ని తగ్గించేలా నల్లపాడు-బీబీనగర్ డబ్లింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా 4 దశల్లో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ లైన్ పూర్తయితే ఇరు రాజధానుల మధ్య ప్రయాణ సమయం కేవలం 3 గంటలకు తగ్గనుంది. రైళ్ల వేగం పెరగడంతో పాటు క్రాసింగ్‌ల ఇబ్బందులు తొలగి ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది.


