News February 8, 2026

వనపర్తి: మున్సిపల్ బరిలో సతీమణుల సమరం

image

వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డులో పాత ప్రత్యర్థులే ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. కాకపోతే గతసారి భర్తలు పోటీల్లో ఉండగా ఈసారి మహిళలకు రిజర్వ్ కావడంతో భార్యలను బరిలో దింపారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా సత్యం, బీఆర్‌ఎస్ నుంచి మెకానిక్ శీను, బీజేపీ నుంచి భరత్ పోటీలో ఉండగా సత్యం విజయం సాధించారు. ఈసారి మూడు పార్టీల నుంచి ముగ్గురి సతీమణులు పోటీలో ఉన్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందో వచి చూడాల్సిందే.

Similar News

News February 8, 2026

కరీంనగర్‌లో MIM కీ ‘రోల్’

image

KNR కార్పొరేషన్‌లో ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేందుకు MIM పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 15 స్థానాలు సాధించిన MIM.. ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలను గెలిచి BJPకి చెక్ పెట్టాలని చూస్తోంది. ఈసారి మేయర్ ఎంపికలో MIM కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీ KNRలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. BRSకు <<19081458>>ఓటు<<>> వేస్తే BJPకే వేసినట్లే అని ఆయన పేర్కొన్నారు.

News February 8, 2026

మిత్రపక్షాల సమరం.. పొంగులేటి vs కూనంనేని

image

అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న మిత్రపక్షాలు.. కొత్తగూడెం కార్పొరేషన్ పోరులో మాత్రం తలపడుతున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి పొంగులేటి, CPI అభ్యర్థుల కోసం MLA సాంబశివరావు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌‌ని గెలిపించాలని మంత్రి కోరుతుంటే, CPIని ఆదరించాలని ఎమ్మెల్యే పిలుపునిస్తున్నారు. నిన్నటి మిత్రులు నేడు ప్రత్యర్థులుగా మారి ప్రచారం చేస్తుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

News February 8, 2026

మార్కాపురం జిల్లా రూపురేఖలు మారుస్తాం: MLA

image

మార్కాపురం జిల్లా సాధించడమే కాకుండా అభివృద్ధి చేసి చూపుతామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ… చెరువును ట్యాంక్ బండ్‌లా మార్చి అన్నగారి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అల్లూరి పోలేరమ్మ ఆలయం వైపు కలెక్టరేట్ కార్యాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐదు సంవత్సరాలలో మార్కాపురం జిల్లా రూపురేఖలు మారుస్తామన్నారు.