News April 21, 2025

వనపర్తి: మేడే ఉత్సవాలకు సిద్ధం కావాలి: విజయ రాములు

image

వనపర్తి జిల్లాలో మే 1న అంతర్జాతీయ కార్మిక దినం మే డేకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు ఒక ప్రకటనలో కోరారు. గ్రామాల్లో పార్టీ జెండాలు దిమ్మెలకు రంగులు వేసి ముస్తాబు చేయాలన్నారు. గ్రామ, మండల శాఖ సమావేశాలను పూర్తి చేయాలని, సమావేశాల్లో గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించాలని పేర్కొన్నారు.

Similar News

News April 21, 2025

డోలీ మోతలు లేకుండా చేస్తాం: మంత్రి సంధ్యారాణి

image

అల్లూరి సీతారామరాజు జిల్లా కించుమాందాలో రూ. 440 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్‌ను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ గ్రామ అభివృద్ధిలో కీలకమైన ముందడుగని మంత్రి తెలిపారు. డోలీ మోతలు లేకుండా అన్ని గిరిజన తండాలకు రోడ్లు వేస్తామని తెలిపారు. ప్రజలు, అధికారులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.

News April 21, 2025

ఆ పోస్టుకు సమంత లైక్.. విడాకుల కారణంపై చర్చ

image

‘భార్య అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికే మొగ్గుచూపుతాడు. కానీ భార్య మాత్రం భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా అతడిని విడిచిపెట్టాలనుకోదు’ అనే ఓ ఇన్‌స్టా పోస్టుకు హీరోయిన్ సమంత లైక్ కొట్టారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది. సామ్ గతంలో మయోసైటిస్‌తో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాధే ఆమె విడాకులకు కారణమా? అని చర్చించుకుంటున్నారు. 2021లో చైతూ, సామ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

News April 21, 2025

నరసరావుపేట: విద్యార్థిగా మారిన జిల్లా కలెక్టర్

image

పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు విద్యార్థిగా మారారు. స్థానిక మున్సిపల్ బాయ్స్ హైస్కూల్‌లో తరగతుల ట్రాన్సిషన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. చిన్నారులతో కలిసి ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చున్నారు. వారితో కలిసి పాఠాలు విన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!