News September 12, 2025
వనపర్తి: యూరియా వాడకంపై డీఏఓ సూచన

వరి పంటకు మోతాదుకు మించి యూరియా వాడితే చీడపీడలు ఎక్కువగా వస్తాయని వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి అంజనేయులు గౌడ్ అన్నారు. యూరియా సరఫరా నిరంతర ప్రక్రియ కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యూరియా వినియోగం గణనీయంగా పెరిగిందని, గత ఏడాది 12,899 మెట్రిక్ టన్నులు వాడితే, ఈ ఏడాది 18,685 మెట్రిక్ టన్నుల యూరియాను వాడినట్లు తెలిపారు.
Similar News
News September 12, 2025
ఎనుమాముల బియ్యం నిల్వ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఎనుమాముల మండల బియ్యం నిల్వ కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. నిల్వలో ఉన్న బియ్యం నాణ్యత, భద్రతా ఏర్పాట్లు, నిల్వ విధానం, రికార్డుల నిర్వహణను జాగ్రత్తగా పరిశీలించారు. సమర్థంగా నిర్వహణ కొనసాగించి రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు మరింత పటిష్టం చేయాలని సూచించారు.
News September 12, 2025
అన్నమయ్య: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట వద్దగల చెన్నకేశవస్వామి గుడి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళంపల్లికి చెందిన అంకమ్మ(70), రామచంద్రయ్య(50) మరో వ్యక్తి రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు.
News September 12, 2025
పెద్దపల్లి: బాలికపై అత్యాచారం.. జైలు శిక్ష

పెద్దపల్లి PS పరిధిలో POCSO కేసులో నిందితుడు మందల రవి(41)ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు పదేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.10,000జరిమానాను కోర్టు విధించింది. బాధితులకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రూ.2లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2017లో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు విచారించి, కోర్టులో సాక్ష్యాలు సమర్పించి నేరాన్ని నిరూపించడంతో DIG అభినందించారు.