News October 13, 2025

వనపర్తి: రమణీయతకు ఆలవాలం.. తిరుమలనాథున్ని క్షేత్రం..!

image

వనపర్తిలోని చిట్టడవిలో కొలువైన తిరుమలనాథుడి క్షేత్రం రమణీయతకు ఆలవాలంగా మారింది. తిరుమలయ్య గుట్ట చుట్టూ కొండలు, లోతైన లోయలు, పచ్చని పరిసరాలు, దట్టమైన చెట్ల పొదలు, పచ్చదనంతో కళకళలాడే సుందర దృశ్యాలు, పక్షుల కిలకిలరావాలు, ఎలుగు బంట్లకు నివాసాలుగా మారిన రాళ్ల గుహలు, స్వామివారి సన్నిధి నుండి తిలకిస్తే కొండచిలువలా వంపులు తిరిగిన రహదారి, రాళ్లపై జాలువారే నీటి ప్రవాహాలు చూపరులను చాలా ఆకట్టుకుంటాయి.

Similar News

News October 13, 2025

24న గల్ఫ్ దేశాల పర్యటనకు సీఎం

image

AP: సీఎం చంద్రబాబు ఈనెల 24న గల్ఫ్ టూర్‌కు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబిలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగే ప్రత్యేక సమావేశంలో P-4 కార్యక్రమం గురించి వివరించడంతోపాటు పెట్టుబడులపై చర్చించనున్నారు. ఈ మేరకు సీఎం టూర్‌కు కేంద్రం అనుమతిచ్చింది. ప్రవాసులతో భేటీకి అవసరమైన సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది.

News October 13, 2025

VKB: ఇసుక మాఫియాకు రాజకీయ నేతల అండ?

image

వికారాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఈ దందాకు అంతా బడా నాయకుల అండ దండలతోనే సాగుతోందని విశ్వసనీయ సమాచారం. దీనిని అరికట్టేందుకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రయత్నిస్తే వాహనాలు వారిపైకి ఎక్కిచ్చేస్తున్నారు. తాజాగా తాండూర్‌లో ఓ ఘటన కలకలం రేపింది. వాహనాలు ఆపిన మరుక్షణమే ఓ బడా నాయకుడి నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే విడిచిపెట్టకుంటే బెదిరింపులు పాల్పడుతున్నారనేది జిల్లాలో బహిరంగ రహస్యం.

News October 13, 2025

ఖమ్మం జిల్లాలో భారీగా తగ్గిన మిర్చి సాగు..!

image

విదేశాల్లో డిమాండ్‌ ఉన్నా, జిల్లాలో మిర్చి సాగు గణనీయంగా తగ్గింది. గతేడాది తీవ్ర నష్టాలు, చీడపీడలతో పెట్టుబడి కూడా దక్కకపోవడంతో రైతులు మిర్చిని తోటలోనే వదిలేశారు. దీంతో ఈసారి చాలామంది రైతులు మిర్చిని పక్కనపెట్టి పత్తి వైపు మొగ్గు చూపారు. గతేడాది 70 వేల ఎకరాల్లో సాగైన మిర్చి, ఈ ఏడాది కేవలం 30 వేల ఎకరాలకే పడిపోవడం గమనార్హం. ఎగుమతులు లేక ధర పడిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.