News January 24, 2025

వనపర్తి: రాజకీయాలకు చివరి తేదీ లేదు: ఎమ్మెల్యే

image

రాజకీయాల్లో కొనసాగాలనుకునే వారికి చివరి తేదీ అంటూ ఏమీ లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా అందరం కలిసికట్టుగా వనపర్తి అభివృద్ధికి పనిచేద్దామన్నారు. అన్ని వార్డులు మనవేనని అభివృద్ధిలో వివక్ష చూపేది లేదన్నారు. కౌన్సిలర్ల పదవీకాలం ముగివస్తున్న నేపథ్యంలో అందరికీ శాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

Similar News

News July 5, 2025

NLG: 8 నుంచి పోస్టల్‌లో కొత్త సాఫ్ట్వేర్

image

పోస్టల్ డివిజన్లోని NLG, యదాద్రి BNG జిల్లాల్లో జూలై 8 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద NLG డివిజన్లోని 2 హెడ్ ఆఫీసులు, 37 సబ్ పోస్టాఫీస్‌లు, 392 పోస్టాఫీస్‌లు, 353 బ్రాంచ్ ఆఫీసుల్లో నూతనంగా ఐటీ 2.0 అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 5, 2025

రైతులకు శుభవార్త.. ఆగస్టు నాటికి కొత్త పాస్ పుస్తకాలు

image

AP: రీసర్వే పూర్తైన గ్రామాల్లో ఆగస్టు నాటికి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి పాస్‌బుక్‌పై QR కోడ్‌తో పాటు ఆధార్ ఆధారంగా తమ సొంత భూమి వివరాలు తెలుసుకునేలా చర్యలు సూచించారు. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.

News July 5, 2025

విజయవాడలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం

image

విజయవాడలో రూ.20.31 కోట్లతో 84 అభివృద్ధి పనులు చేపట్టేందుకు నగరపాలక సంస్థ (వీఎంసీ) టెండర్లు ఆహ్వానించింది. డ్రైన్లు, రహదారులు, కల్వర్టులు, నీటి సరఫరా మరమ్మతులే లక్ష్యమని కమిషనర్ హెచ్‌ఎం. ధ్యానచంద్ర తెలిపారు. ఆసక్తిగల గుత్తేదారులు వివరాల కోసం https://apeprocurement.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.