News March 29, 2025
వనపర్తి: రాజీవ్ యువ వికాసానికి అర్హతలు ఇవే.!

✓ గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల వార్షికాదాయం, పట్టణ ప్రాంతాల్లో రూ.2 వార్షికాదాయం ఉన్నవారు అర్హులు.✓ దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్ కార్డు లేకుంటే తాజా ఆదాయ ధ్రువపత్రం వివరాలను ఇవ్వాలి. ✓ వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తుదారు వయసు 21-55 సంవత్సరాల మధ్య ఉండాలి. ✓ వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు 21-60 ఏళ్ల మధ్య ఉండాలి.✓ ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత.
Similar News
News October 31, 2025
HYD: ‘3 నెలల క్రితమే మంత్రి పదవిపై నిర్ణయం’

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అజార్‌పై ఉన్న కేసుల గురించి స్పష్టంగా చెప్పాలంటే కిషన్‌రెడ్డి ముందుకు రావాలని సవాల్ విసిరారు. 3 నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవిపై నిర్ణయం తీసుకున్నామని, దీంతో మైనారిటీలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.
News October 31, 2025
విశాఖపట్నం పోర్టులో 58 పోస్టులు

విశాఖపట్నం పోర్ట్ 58 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్/ డిప్లొమా అర్హతగల అభ్యర్థులు NOV 1 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 27, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు 31 ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9వేలు, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: vpt.shipping.gov.in
News October 31, 2025
తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: కవిత

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన,బూజు పట్టిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలన్నారు.


