News April 8, 2025
వనపర్తి: రేపటి నుంచే వార్షిక పరీక్షలు

వనపర్తి జిల్లా పాఠశాలల్లో 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 17న పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.
Similar News
News November 6, 2025
సిద్దిపేటలో ఈనెల 7న మినీ జాబ్ మేళా

సిద్దిపేటలోని సెట్విన్ కేంద్రంలో ఈ నెల 7న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ తెలిపారు. ఈ మేళాలో హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీలో పలు ఖాళీ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
News November 6, 2025
అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.
News November 6, 2025
నేడు నాలుగో టీ20.. గెలుపుపై ఇరు జట్ల కన్ను!

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ మ.1.45 గంటలకు 4వ T20 జరగనుంది. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచుల్లో తొలి T20 రద్దు కాగా చెరొకటి గెలిచాయి. నేటి మ్యాచులో గెలిచి సిరీస్‌లో ముందంజ వేయాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. గత మ్యాచులో గెలవడం భారత్‌కు కాస్త సానుకూలాంశం. బౌలింగ్‌లో స్టార్ బౌలర్ బుమ్రా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో గిల్, సూర్య, తిలక్ భారీ స్కోర్లు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు.


