News March 29, 2025

వనపర్తి: రేషన్‌కార్డు దారులకు శుభవార్త

image

ఉగాది పర్వదినం నుంచి ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేయనున్నారు. మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీతో రేషన్‌కార్డులు కలిగి ఉన్నవారందరికీ ప్రయోజనం కలుగనున్నది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 23, 2025

కృష్ణా: ప్రమాదంలో యువకుడి మృతి.. మరొకరికి గాయాలు

image

చల్లపల్లి మండలం మాజేరు గ్రామ సమీపంలో 216 జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల విరాల మేరకు.. బైక్‌ను కారు ఢీ కొట్టింది. సిరివెల్ల భాగ్యం రాజు (24) మృతి చెందగా, చెన్ను రాఘవ (25) తీవ్ర గాయాలతో గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 23, 2025

ఎంపీ, ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు: కేంద్ర మంత్రి

image

ప్రతి MP, MLA అభివృద్ధి నిధుల్లో కమీషన్ తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాఝీ వ్యాఖ్యానించారు. ‘నేను కూడా కమీషన్ తీసుకున్నాను. దాన్ని పార్టీకి ఇచ్చేవాడిని. మీరు కనీసం 5% కమీషన్ అయినా తీసుకోవాలి’ అని HAM(S) పార్టీ మీటింగ్‌లో నేతలకు సూచించారు. MPకి ₹5CR వరకు అభివృద్ధి నిధి ఉంటుందని, 10% కమీషన్ తీసుకున్నా ₹40 లక్షలకు పైనే వస్తుందని అన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

News December 23, 2025

గద్వాల: చేనేత ప్రదర్శన అద్భుతం: గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

image

జిల్లాలో మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటించారు. తొలుత అలంపూరులో జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ఆయన, మధ్యాహ్నం గద్వాల కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ముఖ్యంగా గద్వాల చేనేత ఖ్యాతిని చాటేలా ఏర్పాటు చేసిన మగ్గం, జరీ చీరల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని గవర్నర్‌ ప్రశంసించారు.