News March 2, 2026

వనపర్తి: రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

image

వనపర్తి మండలం చిట్యాల మార్కెట్ యార్డు ముందు రాత్రి 8 గంటలకు పల్సర్ బైక్ కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై ఉన్న బిజినేపల్లి మండలం మహదేవుని పేటకు చెందిన హేమంత్, శ్రీకాంత్, విజయ్ గాయపడ్డారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించగా.. ఒకరికి వనపర్తి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని వనపర్తి రూరల్ SI రిషికేష్ తెలిపారు. కుటుంబ సభ్యులు వారి వెంటే ఉన్నారని ఫిర్యాదు అందలేదని చెప్పారు.

Similar News

News March 6, 2026

అమెరికా చేతిలో గల్ఫ్ దేశాలు బలి!

image

మిడిల్ ఈస్ట్‌లోని చాలా దేశాల్లో అమెరికాకు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఆయా దేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు, ఆటంకాలు లేని చమురు సరఫరా కోసం అమెరికా ఈ స్థావరాలను నిర్మించింది. అయితే అవే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ముప్పుగా మారాయి. వాటిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులకు తెగబడుతోంది. దీంతో అసలు యుద్ధంతో సంబంధం లేని సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్, కువైట్‌లకు నష్టం వాటిల్లుతోంది.

News March 6, 2026

సివిల్స్ ఫలితాల్లో జనగామ యువకుడి సత్తా

image

సివిల్స్ ఫలితాల్లో జనగామ జిల్లాకు చెందిన భరత్ నాయక్ సత్తా చాటారు. 2023లో ఐఎఫ్ఎస్ కు సెలక్ట్ అయిన ఆయన తాజా ఫలితాల్లో 900వ ర్యాంక్ సాధించారు. ఐఐటి మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈ సందర్భంగా భరత్ నాయక్ తల్లిదండ్రులు బానోత్ దస్రు నాయక్, అనసూయ దంపతులను జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

News March 6, 2026

ఏసీలు కొనేవారికి షాక్

image

వేసవి ప్రారంభంలోనే ఏసీ ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే LG, హిటాచీ దాదాపు 5-7 శాతం రేట్లను పెంచాయి. రానున్న 3-10 రోజుల్లో బ్లూ స్టార్, వోల్టాస్, ఇతర బ్రాండ్లు 10-15 శాతం మేర ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. పెరిగిన ముడి సరకు ధరలను భర్తీ చేసుకోవడానికి కంపెనీలు వేసవి డిమాండ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యంగా AC కంప్రెసర్లు, కాయిల్స్‌లో వాడే <<19232225>>రాగి రేటు<<>> భారీగా పెరిగిన విషయం తెలిసిందే.