News March 28, 2025
వనపర్తి: వాటిని మహిళా సంఘాలకు కేటాయించండి: కలెక్టర్

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అత్యధికంగా మహిళా సంఘాలకు కేటాయించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా ఉండేందుకు ఏఈవోల ద్వారా మహిళా సంఘాలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఈ శిక్షణలో వారు తప్పనిసరిగా పాల్గొనే విధంగా చూడాలని సూచించారు.
Similar News
News April 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో భానుడి భగభగ

ఆసిఫాబాద్ జిల్లాలో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో రోజూ 38 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం 10 దాటితే రోడ్లన్ని నిర్మాణుష్యాన్ని తలపిస్తున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News April 1, 2025
జాగ్రత్త.. నంద్యాలలో భారీ చోరీ

నంద్యాల నగరంలోని క్రాంతి నగర్‌లో 2 రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. నంద్యాల రూరల్ PS ఎస్‌ఐ గంగయ్య వివరాల ప్రకారం.. ట్రైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాన్ కుటుంబ సమేతంగా 2 రోజుల ముందు HYD వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇదే అదునుగా చేసుకుని ఇంట్లో చొరబడి 6 తులాల బంగారం, అర్ధకేసీ వెండి, రూ.5.30 లక్షల నగదు చోరీ చేశారు. ఈ ఘటన మొత్తం CC కెమెరాలో రికార్డ్ కాగా ఇదంతా చెంచు గ్యాంగ్ పనని తేలింది.
News April 1, 2025
INDvsENG: ప్రతిష్ఠాత్మక ట్రోఫీకి రిటైర్మెంట్!

ప్రతిష్ఠాత్మక పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌ను 2007 నుంచి పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహిస్తోంది. ఇకపై ఇరు దేశాల్లోని ఇతర దిగ్గజాల పేరిట సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జూన్-జులై మధ్య జరిగే సిరీస్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశముంది. IND తరఫున 46 టెస్టులు ఆడిన పటౌడీ 2011లో మరణించారు.