News September 8, 2025
వనపర్తి: వాట్సాప్‌లో ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే అపరిచిత ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని ఎస్పీ రావుల గిరిధర్ ప్రజలకు సూచించారు. ఆఫర్లు, బహుమతుల పేరుతో వచ్చే ఈ ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తే మీ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫైల్స్ ద్వారా ఫోన్లలోకి వైరస్ చొరబడి డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Similar News
News September 9, 2025
పాక్‌ను తేలికగా తీసుకోం: భారత బౌలింగ్ కోచ్

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను తేలికగా తీసుకోబోమని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపారు. పాక్‌తో సవాలు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని, ఆ జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. తమ నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతామన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్/బౌలింగ్ చేసేలా ఆల్‌రౌండర్లకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాగా భారత్, పాక్ మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది.
News September 9, 2025
NZB: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియామకం

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియమితులయ్యారు. ఈ అవకాశం కల్పించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించి పార్టీ ఎదుగుదలకు శాయశక్తులా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
News September 9, 2025
KNR: మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శం

నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. హుస్సేనీపురా బొంబాయి స్కూల్ నుంచి రాజీవ్ చౌక్ కరీముల్లాషా దర్గా వరకు ర్యాలీ తీశారు. తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన పండుగ వేడుకల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మతపెద్దలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శమన్నారు.