News December 11, 2025

వనపర్తి: విజయోత్సవ ర్యాలీలు నిషేధం: ఎస్పీ

image

మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లో ఉంటుందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ, ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. శాంతియుత వాతావరణం కోసం ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు.

Similar News

News March 4, 2026

BJP ‘రాజ్య’సభ వ్యూహం ఇదే..

image

BJP <<19289210>>రాజ్యసభ<<>> అభ్యర్థుల ఎంపిక వెనక స్పష్టమైన వ్యూహాలు ఉన్నట్లు అర్థమవుతోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌ను ఎగువ సభకు పంపడం ద్వారా 2029 ఎన్నికల కోసం ఆయన్ను జాతీయ రాజకీయాల్లో స్థిరపరచాలని అనుకుంటోంది. కుల సమీకరణాలకు ప్రాధాన్యం ఉండే బిహార్‌లో దళిత నేత శివేశ్‌ను ఎంపిక చేసింది. అస్సాం, బెంగాల్ వంటి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేలా అభ్యర్థులను సెలక్ట్ చేసింది.

News March 4, 2026

వార్ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా

image

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈనెల 19న రావాల్సిన ఈ చిత్రాన్ని మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల అవుతుందని ప్రకటించింది. ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లో విడుదల కానున్నట్లు తెలిపింది.

News March 4, 2026

NLG: అంగన్వాడీలకు ఇక వెలుగులు

image

జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చర్యలు చేపట్టింది. చిన్నారుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కనెక్షన్ల ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నారు. జిల్లాలో సుమారు 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.