News October 16, 2025

వనపర్తి: ‘విద్యార్థులు మంచి చెడుపై అవగాహన కలిగి ఉండాలి’

image

వనపర్తి జిల్లా శ్రీనివాసపురం ప్రాథమిక పాఠశాలలో గురువారం బాలబాలికలకు అవగాహన కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వి.రజిని ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు మంచి స్పర్శ, చెడు స్పర్శలు గుర్తించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కలిగించాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు, పరిశుభ్రత అంశాలపై పలు ఉదాహరణలతో వివరించారు. సిబ్బంది కృష్ణయ్య, రఘు పాల్గొన్నారు.

Similar News

News October 16, 2025

స్వచ్ఛభారత్ మిషన్ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపట్టవలసిన టాయిలెట్స్ నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. అధికారుల సమీక్షలో గురువారం కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 52 ప్రభుత్వ వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.5.73 కోట్లు మంజూరు చేశారన్నారు. నిర్దేశించిన సమయంలోగా అధికారులు పనులు పూర్తిచేయాలన్నారు.

News October 16, 2025

17న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ఈ సమావేశంలో సమీక్షిస్తామని చెప్పారు. సభ్యులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.

News October 16, 2025

ములుగు: TOMCOMలో ఉపాధి కల్పనకు దరఖాస్తు చేసుకోండి: తులా రవి

image

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(TOMCOM) ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాకు జిల్లాలోని నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి తుల రవి తెలిపారు. గ్రీసులో హాస్పిటల్, సేవారంగంలో ఉపాధి కల్పించబడుతుందని అన్నారు. హోటల్ మేనేజ్మెంట్ డిప్లమా/డిగ్రీ కలిగిన వారు అర్హులని, పూర్తి వివరాలకు www.tomcom.telangana.gov.in వెబ్ సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.