News April 5, 2025

వనపర్తి: విషాదం.. శివ మృతి 

image

వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామానికి చెందిన శివ శ్రీరామనవమి ఏర్పాట్లలో భాగంగా కరెంట్ షాక్ గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి శివ మృతదేహానికి నివాళులర్పించారు. శివ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండమని మనోధైర్యం చెప్పారు.

Similar News

News February 18, 2026

నల్గొండ: చెర్వు అన్నారం గుట్టపై చరిత్ర ఆనవాళ్లు

image

కట్టంగూరు (M) చెర్వు అన్నారం గుట్టపై అరుదైన చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. చరిత్ర పూర్వ యుగం నుంచి మధ్యయుగాల వరకు సాగిన మానవ నాగరికత గుర్తులు ఇక్కడ లభించడం విశేషం. స్థానిక యువకుల సహకారంతో క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో ఈ ఆధారాలు బయటపడ్డాయి. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించి, పురావస్తు శాఖ ద్వారా తక్షణమే రక్షిత ప్రాంతంగా ప్రకటించి భద్రపరచాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News February 18, 2026

GNT: భారీగా స్టెరాయిడ్ సీసాల స్వాధీనం

image

నల్లపాడు PS పరిధిలోని రెడ్డిపాలెంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 1,860 నిషేధిత స్టెరాయిడ్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బాటిల్‌ను రూ.150 చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల పరిశీలనలో ఈ- స్టెరాయిడ్ ఇచ్చిన గేదెలపాలు తాగిన వారు అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉన్నట్లు సూచించారు. కేసును నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు అప్పగించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

News February 18, 2026

కడప, అన్నమయ్య MLAలకు లోకేశ్ తేనేటివిందు

image

కడప, అన్నమయ్య జిల్లాల్లోని MLAలకు లోకేశ్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. అమరావతిలో ప్రతిరోజూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎమ్మెల్యేలకు విడివిడిగా ఆయన విందును ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి కడప, అన్నమయ్య జిల్లాల ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి మండిపల్లితోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విందుకు రాగా వారిని లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు.