News March 16, 2025

వనపర్తి: వెలుగొండలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా వెలుగొండలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెబ్బేర్ 41.3, కానాయిపల్లి 41.0, రేమోద్దుల 40.9, విలియంకొండ 40.9, పెద్దమందడి 40.5, గోపాల్ పేట 40.3, వనపర్తి 40.2, ఆత్మకూర్ 40.2, దగడ 40.1, రేవల్లి 40.0, జానంపేట 39.8, శ్రీరంగాపూర్ 39.7, ఘన్పూర్ 39.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 2, 2026

పీఎం అజయ్ యోజన పథకానికి కన్నాయపల్లి ఎంపిక

image

రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లి గ్రామం పీఎం అజయ్ యోజన (ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ) పథకానికి ఎంపికైంది. ఈ పథకం ద్వారా 15వ ఫైనాన్స్ నిధులతో పాటు రోడ్లు, మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. ఈ పథకం అమలుపై ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. ఆ పథకానికి ఎంపిక అవ్వడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 2, 2026

SKLM: ఇంటర్ పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 71 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో జనరల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 11,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,164 మంది రాశారు. ఒకేషనల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 1,510 మందికి గాను 1,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు.

News March 2, 2026

భూపాలపల్లి: ప్రజావాణిలో 65 దరఖాస్తుల స్వీకరణ

image

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 65 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ఆయా దరఖాస్తులను అధికారులు జాప్యం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.