News April 15, 2025
వనపర్తి: వేలిముద్రలు పడటం లేదని బియ్యం ఇవ్వడం లేదు: బుచ్చమ్మ

చేతి వేలిముద్రలు కంప్యూటర్‌లో పడటం లేదని రేషన్ షాపులో ఉచిత బియ్యం ఇవ్వటం లేదని పానగల్ మండలం కేతేపల్లికి చెందిన తెలుగు బిచ్చమ్మ తెలిపారు. రేషన్ కార్డులో తన ఒక్క పేరే ఉందన్నారు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు చెరిగిపోయాయని చెప్పారు. కంప్యూటర్లో వేలిముద్రలు నమోదు అయితేనే బియ్యం వస్తాయని చెబుతూ, కొన్నాళ్లుగా ఇవ్వటం లేదని బియ్యం ఇప్పించాలని, అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 16, 2025
సమ్మర్ హలిడేస్.. ప్రకృతి అందాలకు సిక్కోలు నెలవు

వేసవి సెలవుల్లో కుటుంబసమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు సిక్కోలు జిల్లాలో ప్రకృతి అందాలెన్నో ఉన్నాయి. జిల్లాలో ఉద్దానం ప్రాంతంలోని జీడి, మామిడి, పనస తోటలు కేరళను తలపిస్తాయి. బారువ బీచ్, లైట్‌హౌస్, హిరమండలం గొట్టాబ్యారేజ్, శాలిహుండం బౌద్ధ స్తూపాలు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మనాథుడి దేవస్థానాలు, మూలపేట పోర్టు, కళింగపట్నం బీచ్ లైట్ హౌస్ ఇలా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి.
News April 16, 2025
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

AP: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను ఏప్రిల్ 23 మ.3 గంటలకు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు ఏప్రిల్ 23న ఉ.10 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి.
News April 16, 2025
17 మంది వైద్యుల వల్ల కానిది.. ChatGPT చేసింది!

వైద్య రంగంలో AI ఆవశ్యకతను తెలిపే ఓ వార్త వైరల్ అవుతోంది. కొవిడ్ సమయంలో USకు చెందిన తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని 17 మంది వైద్యులకు చూపించింది. ఎవ్వరూ ఆ పిల్లాడి సమస్యకు కారణాన్ని చెప్పలేకపోయారు. విసిగిపోయిన తల్లి ChatGPTకి MRI రిపోర్ట్స్, పిల్లాడి లక్షణాలను వివరించింది. అది ‘టెథర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్’గా నిర్ధారించింది. ఈ సమాచారంతో వైద్యులు పరీక్షలు చేసి, శస్త్రచికిత్స చేశారు.