News April 7, 2025

వనపర్తి: ‘సింగోటం గుడిలో ప్రేమ జంట పెళ్లి చేస్తాం’

image

తమకు పెళ్లి చేయాలని వనపర్తి జిల్లా పానగల్ PSకు వచ్చిన <<16017433>>నందిని, మహేందర్<<>> పెళ్లి త్వరలో చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. నందిని హైదరాబాద్‌లో ఫామ్-డి చదువుతోందని, మహేందర్ డిగ్రీ చదివి జాబ్ సెర్చ్ చేస్తున్నాడన్నారు. ఇద్దరు మేజర్లు, అందులోనూ చదువుకున్న వారు కావడంతో వారి పెళ్లికి కుటుంబీకులను ఒప్పించామని చెప్పారు. మంచి ముహూర్తం చూసి త్వరలో కొల్లాపూర్ పరిధి సింగోటం గుడిలో పెళ్లి చేస్తామన్నారు.

Similar News

News November 5, 2025

కరీంనగర్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

నిరుద్యోగ యువతీయువకులకు జిల్లా కేంద్రంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వై.తిరుపతిరావు తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థలో 30 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్, ఆపై పాసైనవారు, 20- 30ఏళ్ల వయసు గలవారు అర్హులు. ఆసక్తిగలవారు వివరాలకు పైనంబర్లను సంప్రదించవచ్చు. కశ్మీర్ గడ్డ, ఈసేవ కేంద్రం పైఅంతస్తులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని అధికారి సూచించారు.

News November 5, 2025

నిజామాబాద్: మహిళపై వేధింపులు.. ఇద్దరిపై కేసు నమోదు: SI

image

ఆయిల్ గంగాధర్, కొండా అమర్ అనే వ్యక్తులు తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ వెంటపడుతూ, వేధిస్తున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిరువురిపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని NZB 4వ టౌన్ SI కె.శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. కాగా బాధితురాలు సోమవారం ఓ వైద్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి తనను వేధిస్తున్నారని CPకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

News November 5, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 05, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.16 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.