News February 7, 2025

వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

image

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.

Similar News

News February 7, 2025

KNR: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

News February 7, 2025

మెదక్: అప్పుడే మండుతున్న ఎండలు

image

గత కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లాలో 35.8 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి తొలి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. పొద్దున, సాయంత్రం చల్లగా ఉన్నప్పటికీ పగటిపూట ఎండలు సుర్రుమంటున్నాయి.

News February 7, 2025

MBNRలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లా న్యూ <<1538043>>టౌన్‌ <<>>వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి అతివేగంగా, ఆజాగ్రత్తగా బైక్ నడపడమే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19) నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!