News February 7, 2025
వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.
Similar News
News September 19, 2025
భద్రాద్రి: పాపడలా జలపాతం.. పర్యాటకుల సందడి

మణుగూరు సమీపంలోని రథం గుట్టపై ఉన్న ‘స్వప్న జలపాతం’ చూపరులను ఆకట్టుకుంటోంది. దట్టమైన అడవి, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారుతున్న ఈ జలపాతం నుదుటిన పెట్టుకునే ‘పాపడబిళ్ల’లా కనిపిస్తుందని పర్యాటకులు అంటున్నారు. జలపాతాన్ని సందర్శించేందుకు అనువైన మార్గం లేదని.. ప్రభుత్వం స్పందించి రహదారి, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
PC: MANUGURU_UPDATES
News September 19, 2025
పార్టీ ఫిరాయింపు.. MLA సంజయ్‌కు మళ్లీ నోటీసులు!

పార్టీ ఫిరాయింపుపై JGTL MLA సంజయ్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు పంపారు. BRSలోనే కొనసాగుతున్నానని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే CMని కలిశానని, పార్టీ మారలేదని సంజయ్ మునుపటి నోటిసుకు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని స్పష్టమైన ఆధారాలు కావాలని కోరారు. కాగా, MLAల పార్టీ ఫిరాయింపుపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.
News September 19, 2025
రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్‌గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.