News January 8, 2026
వనపర్తి: స్పోర్ట్స్ రంగంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

స్పోర్ట్స్ రంగంపై బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, కాంగ్రెస్ వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్, ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీనివాస్, రాజు తదితరులు ఉన్నారు.
Similar News
News January 9, 2026
‘జన నాయకుడు’ వివాదం.. నేడు కోర్టులో విచారణ

విజయ్ ‘జన నాయకుడు’ విడుదలపై మద్రాసు హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఇవాళ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. సెన్సార్ బోర్డు తీరుపై మేకర్స్ HCని ఆశ్రయించారు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. న్యాయస్థానం తీర్పుపై విజయ్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందో లేదో చూడాలి.
News January 9, 2026
HNK: నిందితుల పరారీ.. నలుగురు సిబ్బంది సస్పెండ్

నిందితులకు ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసుల నిర్లక్ష్యంతో ముగ్గురు గంజాయి నిందితులు పరారైన ఘటనలో నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ WGL సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 8న చెన్నైకి చెందిన నలుగురిని WGL డ్రగ్ కంట్రోల్ టీం పట్టుకుని HNK స్టేషన్‌కు తరలించింది. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు మధుసూదన్, నగేష్, హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య, హోంగార్డు రాజు విధుల్లో నిద్రపోవడంతో నిందితులు పరారయ్యారు.
News January 9, 2026
ఖరీఫ్, రబీకి అనుకూలం.. APHB 126 సజ్జ రకం

ఏపీలోని అనంతపురం వ్యవసాయ పరిశోధనా కేంద్రం APHB 126 సజ్జ రకాన్ని అభివృద్ధి చేసింది. ఈ రకం పంట కాలం 84 నుంచి 86 రోజులు. ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేయడానికి ఇది అనుకూలమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సజ్జరకంలో ఇనుము, జింకు అధికంగా ఉంటాయని తెలిపారు. హెక్టారుకు 30 నుంచి 33 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల దీన్ని విడుదల చేశారు.


