News March 15, 2025
వనపర్తి: హక్కులపై అవగాహన అవసరం: వెంకటేశ్వర్లు

వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మార్చి 15న ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్లోని పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో వినియోగదారులకు హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
Similar News
News November 15, 2025
విశాఖ-కాకినాడ-భీమిలి నుంచి క్రూయిజ్ టూరిజంపై చర్చ

కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో కోస్టల్ టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కోర్డెలియా క్రూయిజెస్ కలిసి రావాలని సీఎం కోరారు. విశాఖ-కాకినాడ-భీమిలి పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు. క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై కోర్డెలియా క్రూయిజెస్ ఆసక్తి చూపింది.
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News November 15, 2025
బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి: కలెక్టర్

బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి చెందిందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో సూర్యలంక బీచ్, రామాపురం బీచ్‌లకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారని, అక్కడ రిసార్ట్‌లు బాగా అభివృద్ధి చెందాయని, పరిసరాలను ఎల్లవేళలా పరిశ్రమంగా ఉంచి, పర్యాటకులను ఆకర్షించాలన్నారు. పర్యాటకులు ఎక్కువగా జిల్లాకు వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుందని తద్వారా జీడీపీ రేటు పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.


