News March 21, 2025
వనపర్తి: ‘75 మంది ఒకేషనల్ విద్యార్థులు గైర్హాజరు’

ప్రథమ సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయని వనపర్తి ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆరు సెంటర్లలో పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. 925 మంది విద్యార్థులకు గాను 850 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 75 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
Similar News
News March 22, 2025
ధర్మపురి: అగ్ని జ్వాలలో లక్ష్మీనరసింహస్వామి దివ్య రూపం!

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో సుదర్శన నారసింహ హోమ పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్నిజ్వాలలో నరసింహస్వామి అపురూప దృశ్యం దర్శనమిచ్చింది. అగ్నిజ్వాలలో లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపించడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీకు లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.
News March 22, 2025
ఏకాగ్రత కుదరటం లేదా? ఈ టిప్స్ పాటించండి

ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. సుడోకు, క్రాస్‌వర్డ్స్ వంటివి సాలో చేస్తూ ఉండండి. రోజూ ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలు భావాలను రాస్తూ ఉండండి. ఏదైనా ఒక విషయాన్ని విజువలైజేషన్ చేయండి. రోజూ వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. మ్యూజిక్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వార మన ఫోకస్ పెంచవచ్చు.
News March 22, 2025
భాష పేరుతో రాజకీయం అందుకే? అమిత్ షా

కొన్ని రాజకీయ పార్టీలు తమ అవినీతిని కప్పి పెట్టడానికే భాష పేరుతో రాజకీయం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. సౌత్ ఇండియా భాషలను తాము వ్యతిరేకిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారని అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తమిళనాడులో NDA కూటమి అధికారంలోకి వస్తే మెడిసిన్, ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలను తమిళ భాషలోకి అనువదిస్తామని తెలిపారు.