News October 9, 2025
వనపర్తి: BE READY.. మరి కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..!

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడత జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు మరి కాసేపట్లో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా ఓటరు జాబితాను ప్రదర్శిస్తారు. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి 5PM వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
Similar News
News October 9, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం అక్కడే!

గడచిన 24 గంటల్లో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా కోడేరు మండలంలో 32.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్‌లో 21.2 మి.మీ., కల్వకుర్తిలో 14.0 మి.మీ., తిమ్మాజీపేటలో 12.3 మి.మీ., బల్మూరులో 11.3 మి.మీ., పెద్దకొత్తపల్లిలో 11.0 మి.మీ., తాడూరులో 6.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
News October 9, 2025
KNR: ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలి: కలెక్టర్

MPTC, ZPTC ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడుతుండడం, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం VC నిర్వహించారు. నామినేషన్ల దాఖలుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీల్ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీచేసే అభ్యర్థుల ప్రకటన వంటి ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలన్నారు.
News October 9, 2025
భారత్ నుంచి నోబెల్ అందుకున్నది వీరే..

<<17948949>>నోబెల్<<>> పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్(1913-సాహిత్యం) నిలిచారు. 1930లో సి.వి.రామన్(ఫిజిక్స్), 1979లో మదర్ థెరిసా(శాంతి), 1998లో అమర్త్యసేన్(అర్థశాస్త్రం), 2014లో కైలాశ్ సత్యార్థి(శాంతి) ఈ జాబితాలో ఉన్నారు. భారత సంతతి వారిలో హరగోవింద్ ఖొరానా(వైద్యశాస్త్రం), సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్(ఖగోళ భౌతిక), వెంకట్రామన్ రామకృష్ణన్(రసాయన), అభిజిత్ బెనర్జీ(అర్థశాస్త్రం) ఉన్నారు.