News March 26, 2025

వనపర్తి POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా వనపర్తి డీసీసీ చీఫ్‌గా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం చీర్ల చందర్, సాయిచరణ్ రెడ్డి, L.సతీశ్ ఆశావహులుగా ఉన్నారు.

Similar News

News July 4, 2025

ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మాదే: భట్టి

image

TG: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మార్చడానికి అది కేవలం ఒక పుస్తకం కాదు. రాజ్యాంగం లేకపోతే ఎవరికీ హక్కులు ఉండేవి కావు’ అని సామాజిక న్యాయ సమరభేరి సభలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.

News July 4, 2025

ఎస్పీ గారు.. థ్యాంక్యూ: పవన్ కళ్యాణ్

image

తన పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంపై ఎస్పీ దామోదర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా అభినందించారు. మార్కాపురం పర్యటన అనంతరం హెలిప్యాడ్ వద్ద ఎస్పీని పవన్ ప్రత్యేకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతల స్థితిగతులు సైతం మెరుగ్గా ఉన్నాయని పవన్ చెప్పడం విశేషం.

News July 4, 2025

కోనరావుపేట: ‘జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి’

image

జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో రూ. 5 కోట్ల 14 లక్షలతో చేపట్టిన అదనపు మౌలిక వసతుల నిర్మాణం పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన, భూమి పూజ చేశారు.