News November 12, 2024
వయా జహీరాబాద్.. ముంబై- HYD బుల్లెట్ ట్రైన్

ముంబై- హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైల్వే ప్రాజెక్ట్ కోసం డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేసి రైల్వే మంత్రిత్వశాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును 2051 వరకు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. కొత్త లైన్ నిర్మాణానికి అధికారులు పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.
Similar News
News September 15, 2025
మెదక్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు పక్కాగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. మెదక్ బాలికల హై స్కూల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 22 నుంచి 28 వరకు ఈ పరీక్షలు 6 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
News September 15, 2025
మెదక్: ప్రజా పాలన ఉత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి వివేక్

ఈనెల 17న నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఉత్సవంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నారు. మెదక్లో జరిగే కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
News September 15, 2025
మెదక్ సీసీఎస్ ఇన్స్పెక్టర్గా కృష్ణమూర్తి బాధ్యతలు

మెదక్ జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) ఇన్స్పెక్టర్గా ఎం. కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు బాధ్యతలుగా టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్గా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.