News September 23, 2025

వయోజన పాఠశాల, బ్రాంచి పోస్టాఫీస్ ఏర్పాటు చేశారు.!

image

రంగస్థల నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు బాచు అచ్యుతరామయ్య సెప్టెంబర్ 23, 1926 గుంటూరు జిల్లాలో గాజుల్లంకలో జన్మించారు. గాజుల్లంకలో వయోజన పాఠశాల, బ్రాంచి పోస్టాఫీస్ ఏర్పాటు చేశారు. గాజుల్లంకలో 36 ఏళ్లు ఉపాధ్యాయులుగా, 40 ఏళ్లు బ్రాంచి పోస్ట్ మాస్టర్‌గా పనిచేశారు. పదవీ విరమణ సమయంలో 40మంది కళాకారులను, క్రీడా కారులను, విద్యావేత్తలను సన్మానించారు. 1958 ప్రాంతంలో విరివిగా నాటకాలలో నటించారు.

Similar News

News September 23, 2025

అనకాపల్లి జిల్లాలో 94 సైబర్ కేసులు: ఎస్పీ

image

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ఈ ఏడాది జూలై 1 నుంచి ఇప్పటివరకు 94 సైబర్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు రూ.93.78 లక్షలను ఫ్రీజ్ చేశామన్నారు. అలాగే రూ.15.45 లక్షల మొత్తాన్ని బాధితులకు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.

News September 23, 2025

రెచ్చగొట్టేలా పాక్ ప్లేయర్ల సెలబ్రేషన్స్.. ఇర్ఫాన్ ఫైర్

image

భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు రవూఫ్, ఫర్హాన్ <<17788891>>రెచ్చగొట్టేలా<<>> సెలబ్రేషన్స్ చేసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఫైరయ్యారు. ‘ఇరు దేశాల మధ్య పరిస్థితి తెలిసి కూడా ఇలా చేయడం అనవసరం. దీని ద్వారా వారిద్దరి క్యారెక్టర్, పెంపకం ఏంటో అర్థమవుతోంది. మరీ ఇంత దిగజారిపోవడం సరికాదు. వారి ప్రవర్తన నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ఇలాంటివి పాక్ ప్లేయర్లకు అలవాటే’ అని మండిపడ్డారు.

News September 23, 2025

దసరా సెలవుల్లో స్కూళ్లు మూసివేయాల్సిందే: డీఈవో

image

దసరా సెలవుల సందర్భంగా పాఠశాలలు తప్పనిసరిగా మూసివేయాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు ఆదేశించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు విధిగా అమలు చేయాలన్నారు. పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ ఆదేశాలను గౌరవించాలని కోరుతూ, ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించరాదని సూచించారు.