News November 19, 2025
వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంది: కలెక్టర్

వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షామీర్‌పేటలోని రుద్రమదేవి ఓల్డ్ హోమ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వయోవృద్ధుల కోసం ప్రత్యేక సంక్షేమ చట్టం ఉందని, తల్లిదండ్రులను సరిగా చూసుకోని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News November 19, 2025
VZM: విధుల్లో ఉండగా ఆర్మీ జవాన్ మృతి

మెరకముడదాం మండలం గొల్లలవలస గ్రామానికి చెందిన అడ్డూరు దుర్గారావు గతేడాది అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అస్సాంలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తూ మరణించాడు. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు దుర్గారావు మృతదేహం గ్రామానికి చేరుకుంటుందని గ్రామస్థులు తెలిపారు.
News November 19, 2025
జమ్మలమడుగు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు YCP ఇన్‌ఛార్జ్ విషయంలో పార్టీ అధిష్ఠానం కీలక ప్రకటన చేసింది. MLC రామసుబ్బారెడ్డికే ఇన్‌ఛార్జ్ పదవి బాధ్యతలు ఇస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మాజీ MLA సుధీర్ రెడ్డికి 3 మండలాలు, రామసుబ్బారెడ్డికి 3 మండలాలు అప్పగించింది. జగన్ సమక్షంలో జరిగిన ఈ పంచాయితీలో రామసుబ్బారెడ్డికే ఖరారు చేసింది. సుధీర్ రెడ్డికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పదవి ఇచ్చింది.