News February 8, 2025
వయోవృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలి: డీఆర్‌వో గణేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739019870773_52257013-normal-WIFI.webp)
వయో వృద్ధులకు తప్పనిసరిగా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి విగణేశ్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాస్థాయి వయోవృద్ధుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేశ్ మాట్లాడుతూ.. వయోవృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
Similar News
News February 8, 2025
ఎద్దు దాడిలో గాయపడ్డ వృద్ధుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739030928106_51739701-normal-WIFI.webp)
నర్సీపట్నం మున్సిపాలిటీ బీసీ కాలనీలో బుధవారం జరిగిన ఎద్దు దాడిలో గాయపడ్డ గీశాల కన్నయ్య అనే వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఎద్దు చేసిన దాడిలో కన్నయ్యకు కాలు, చెయ్యి విరిగిపోయాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ తరలించాలని ఏరియా ఆసుపత్రి వైద్యులు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 8, 2025
పెద్దపల్లి: ఈనెల 10 నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739017957767_14924127-normal-WIFI.webp)
ఈనెల 10న పెద్దపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ప్రజలు దీనిని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన సూచించారు.
News February 8, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739026355156_50225406-normal-WIFI.webp)
*బెల్లంపల్లిలో బీరు సీసాలతో దాడి.. నలుగురిపై కేసు *బెల్లంపల్లి రేంజ్ లోనే పులి ఆవాసం *వింత బారిన పడుతున్న కుక్కలు*వేలాల గిరి ప్రదక్షిణకు ఆర్టీసి బస్సు సౌకర్యం *ఢిల్లీలో గెలుపు పట్ల జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు.