News March 1, 2025

వరంగల్‌కు ఎయిర్‌పోర్టు.. రివ్వున ఎగరనున్న విమానాలు

image

మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓరుగల్లు ప్రజల ఏళ్లనాటి ఆకాంక్ష నెరవేరబోతోంది. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించగా.. మరో 253 ఎకరాల భూమిని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికోసం రూ.205 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపేందుకు ఇప్పుడున్న 1.8 కి.మీ రన్‌వేను 3.9కి.మీలకు పెంచాల్సి ఉంది. మీ కామెంట్

Similar News

News November 3, 2025

నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – కట్టడికి సూచనలు

image

ట్రైకోడెర్మావిరిడె/సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 2 కేజీల మందును.. 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండితో కలిపి నీడలో పొరలు పొరలుగా ఒక కుప్పగా వేసుకోవాలి. దానిపై గోనెకప్పి బెల్లం కలిపిన నీటిని ఒక వారం పాటు చల్లాలి. దీని వల్ల దానిలో శిలీంద్రబీజాలు/బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా తయారైన దానిని పశువుల ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇది నేలసారాన్ని పెంచి తెగుళ్ల ఉద్ధృతిని తగ్గిస్తుంది.

News November 3, 2025

GNT: ఆన్‌లైన్ పెట్టుబడి మోసం.. ముగ్గురి అరెస్ట్

image

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆన్‌లైన్‌ పెట్టుబడి మోసాల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. గుంటూరుకు చెందిన మడతల రమేష్‌రెడ్డి, విశాఖకు చెందిన గండి శ్రీను, విజయవాడకు చెందిన గుర్రపుకొండ శ్రీధర్‌ బాధితుల బ్యాంకు ఖాతాల ద్వారా కోట్ల రూపాయలు లావాదేవీ చేసినట్లు వెల్లడైంది. వీరు వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో నకిలీ పెట్టుబడి పథకాలు నిర్వహించారు. పోలీసులు ఫోన్లు, డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకొన్నారు.

News November 3, 2025

సంగారెడ్డి: రివాల్వర్‌‌‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

image

సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సందీప్ మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కల్హేర్‌కు చెందిన సందీప్ ఏడాదికాలంగా పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ పరితోష్ పంకజ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.