News April 5, 2026

వరంగల్‌కు ఏమైంది? ఎందుకీ హత్యలు, ఆత్మహత్యలు?

image

ఉమ్మడి వరంగల్‌లో దారుణాలు పెరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో కొందరు, ఆడ పిల్లలు పుట్టారని మరికొందరు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారు. బిడ్డ కడుపులో ఉండగానే పలు స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్ చేయిస్తున్నారు. తాజాగా భార్య, <<19561605>>ఇద్దరు కూతుళ్లను పున్నేలులో<<>> భర్త చంపితే.. బోడ మాణిక్యతండా, వర్ధన్నపేటలో భార్యభర్తల మధ్య గొడవలకారణంగా పిల్లలతో కలిసి తల్లులు సూసైడ్ చేసుకున్నారు.

Similar News

News April 5, 2026

మెండోర: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

image

మెండోర మండలం సోన్ పేట్‌కు చెందిన పిండి మధు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై గడ్డిమందు తాగాడు. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు.

News April 5, 2026

విశాఖ: తొమ్మిదేళ్లలో మూడుసార్లు వార్డులు పెంపు(2/2)

image

రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీవీఎంసీలో గత తొమ్మిదేళ్లలో వార్డుల సంఖ్య పెంపు మూడోసారి చేపడుతున్నారు. 2017కి ముందు 72 వార్డులు ఉండగా, 2017లో 81కు, 2020లో పరిసర గ్రామాల విలీనంతో 98కు పెరిగాయి. ప్రస్తుతం 98 నుంచి 120కు పైగా పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం ముందుగా 8 జోన్లుగా ఉన్న జీవీఎంసీని ఇప్పటికే 10 జోన్లుగా విభజించారు.

News April 5, 2026

HYD: సిటీలో ఫస్ట్ థియేటర్ ఏదో మీకు తెలుసా?

image

మల్టీప్లెక్స్‌ల హవాలో భాగ్యనగర సినిమా చరిత్రకు సజీవ సాక్ష్యంగా ‘యాకుత్ మహల్’ థియేటర్ నిలుస్తోంది. 1930ల్లో నవాబ్‌జాఫర్ నవాజ్‌జంగ్ నిర్మించిన ఈ చారిత్రక వేదికల్లో సాక్షాత్తూ నిజాం ప్రభువులే సినిమాలు వీక్షించారు. ఇప్పటికీ పాతతరం చికాగో ప్రొజెక్టర్లతోనే ఇక్కడ షోలు నడుస్తుండటం విశేషం. అతి తక్కువ టికెట్‌ ధరతో సామాన్యులకు వినోదాన్ని పంచుతూ, ఓటీటీల కాలంలోనూ తన ఉనికిని కాపాడుకుంటుంది.