News April 4, 2025

వరంగల్‌కు పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

image

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పుష్-పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారీ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైళ్లను నడపాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

Similar News

News April 11, 2025

రామరాజ్యం తీసుకురావడమే నా కోరిక: CBN

image

AP: రాష్ట్రంలో రామరాజ్య స్థాపనే తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవంలో సతీసమేతంగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఒంటిమిట్టలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసి, టూరిజం హబ్‌గా మార్చుతామని చెప్పారు. తిరుమలలో లాగ ఇక్కడ కూడా నిత్య అన్నదానం నిర్వహించాలని టీటీడీ బోర్డును కోరారు.

News April 11, 2025

PHOTO: ధోనీ నాటౌట్?

image

సీఎస్కే కెప్టెన్ ధోనీ ఔట్ చర్చనీయాంశంగా మారింది. నరైన్ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చారు. ధోనీ రివ్యూ కోరగా రీప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. అయితే రీప్లేలో బంతి బ్యాటు పక్క నుంచి వెళ్తున్న క్రమంలో అల్ట్రాఎడ్జ్‌లో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నట్లు వీడియోలో కనిపించాయి. దీంతో క్లియర్ ఎడ్జ్ అయిందని, ఆయన నాటౌట్ అని పలువురు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారు?

News April 11, 2025

గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్

image

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు మిగతా ఐదుగురు నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో మాధవ్ సహా ఇతర నిందితులను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!