News January 11, 2026

వరంగల్‌లో ఇండోర్ స్టేడియంకు నిధులివ్వండి: రాఘవరెడ్డి

image

వరంగల్ జిల్లాలో ఇండోర్ స్టేడియంకు రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరిని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కోరారు. రాష్ట్రంలో ఉద్యోగాలలో స్పోర్ట్స్‌కు రిజర్వేషన్లను తీసుకురావాలన్నారు. స్టేడియంకు ఎస్టిమేట్స్ తీసుకువస్తే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Similar News

News February 17, 2026

తూ.గో: JEE మెయిన్స్‌లో శ్రీ ప్రకాశ్ విద్యార్థుల ప్రభంజనం

image

JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ ప్రకాశ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జె.మోనేశ్ కుమార్ 99.93, టి.కృష్ణ 98.44 పెర్సంటైల్ సాధించినట్లు సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాశ్ తెలిపారు. తాము IIT- JEE కోచింగ్ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విజేతలను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె నరసింహారావు, ప్రిన్సిపల్ వి.వి.ఎస్.ఎస్ భానుమూర్తి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

News February 17, 2026

జేఈఈ మెయిన్స్ పరీక్షలో సత్తా చాటిన సిక్కోలు విద్యార్థి

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి మెట్ట వెంకట సాయి సరాగ్ సత్తా చాటాడు. 99.59 పర్సంటేజ్‌తో ప్రతిభ కనబరిచాడు. మెరిట్ సాధించిన విద్యార్థుల కు జాతీయ స్థాయి ఇంజినీరింగ్ విద్యా సంస్థలైన ట్రిబుల్ ఐటీ, నిట్, జీఎఫ్‌ఐటీలలో ప్రవేశం లభిస్తుంది. దీంతో పాటు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.

News February 17, 2026

ఖమ్మం: కలెక్టర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి రబీ ధాన్యం సేకరణ ఏర్పాట్లు, వేసవిలో తాగునీటి ఎద్దడి కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోడ్ సేఫ్టీ పనులు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.