News October 22, 2025

వరంగల్‌లో జాబ్ మేళా

image

WGL ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.కల్పన తెలిపారు. ప్రైవేటు సంస్థలో 76 ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా పై చదువులు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎంపికైన వారికి రూ.15,000 వేతనం, టీఏ–డీఏ రూ.3,000 చెల్లిస్తారన్నారు. ఉదయం 11 గంటలకు బయోడేటా, సర్టిఫికేట్ జిరాక్స్‌లతో రావాలన్నారు.

Similar News

News October 22, 2025

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.3,380 తగ్గి ₹1,27,200కు చేరింది. 22 క్యారెట్ల 10g పసిడిపై రూ.3,100 పతనమై ₹1,16,600గా ఉంది. నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్స్(31.10g) ధర $245 తగ్గడమే ఇందుకు కారణం అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,80,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 22, 2025

వరంగల్‌లో నకిలీ ఏసీబీ మోసం

image

గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ అధికారులమని చెప్పి ఆర్టీఏ ఎంవీఐల నుంచి దశల వారీగా రూ.10.20 లక్షలు కాజేశారు. ఫోన్లలో నకిలీ బెదిరింపులు చేయడంతో ఓ ఎంవీఐకు అనుమానం రావడంతో వెంటనే WGL ఏసీబీ డీఎస్సీ సాంబయ్యను ఆశ్రయించారు. దీంతో నిజం తెలిసింది. ఆర్టీఏ అధికారులు మోసపోయిన వివరాలు గుట్టుగా ఉంచాలని ప్రయత్నించగా, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను వెతికే పనిలో పడ్డారు.

News October 22, 2025

ములుగు: మహా జాతరకు ఇంకా 98 రోజులే !

image

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు ఇంకా 98 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జాతర సమయం దగ్గర పడుతుండగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గద్దెల విస్తరణ పనులు తప్ప ఇతర పనులు ఇంకా మొదలు కాకపోవడంతో సర్వత్ర ఆందోళన నెలకొంది. జాతర సమయానికి పనులు పూర్తవుతాయా ?, ప్రతి జాతరలా హడావిడి పనులు చేసి చేతులు దులుపుకుంటారా ? అని భక్తులు అనుమానవం వ్యక్తం చేస్తున్నారు.